భీమా ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మండలంలోని శ్రీరంగాపూర్ గ్రా మం వద్ద నిర్మించిన రంగసముద్రం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను బుధవా రం కలెక్టర్ గిరిజాశంకర్ పరిశీలించారు.
పెబ్బేరు, న్యూస్‌లైన్: భీమా ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మండలంలోని శ్రీరంగాపూర్ గ్రా మం వద్ద నిర్మించిన రంగసముద్రం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను బుధవా రం కలెక్టర్ గిరిజాశంకర్ పరిశీలించారు. అధికారుల ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ని ర్మాణా ల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని కాం ట్రాక్టర్, సంబంధిత అధికారులను ఆదేశిం చా రు. రంగసముద్రం రిజర్వాయర్ ద్వారా కొ ల్లాపూర్ వరకు పంటకాల్వలను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూ పల్లి కృష్ణారావు భీమా కాల్వలను పరిశీలించి ప నులు నాణ్యవంతంగా లేవని, ఈ విషయమై ఉ న్నతాధికారులకు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో బుధవారం కలెక్టర్ స్వయంగా రంగసముద్రం రిజర్వాయర్ పనులతో పాటు కొల్లాపూర్ మండలానికి సాగునీరు అందించే కాల్వపనులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రంగసముద్రం నిర్మాణంతో తమ గ్రామం ముంపునకు గురవుతుందని, పునరావాసం కల్పించాలని శ్రీరంగాపూర్ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ముంపునకు గురవుతున్న రాజులగుట్ట వాసులు తమకు న్యాయం చేయాలని విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భీమా ఎత్తిపోతల పథకం ద్వారా 16వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పునరావాస సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని బాధితులకు హామీఇచ్చారు. అక్కడి నుంచి పాన్‌గల్, వీపనగండ్ల మండలాలల్లో దెబ్బతిన్న భీమా కాల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సీఈ ప్రకాష్, ఎస్‌ఈ రమణమూర్తి, ఈఈలు ప్రభాకర్, ఉమాపతి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.
శంకరసముద్రం పనుల పరిశీలన
కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్: కొత్తకోట మండలం కానాయపల్లి శంకరసముద్రం రిజర్వాయర్ పనులను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పరిశీలించారు. అంతకుముందు గుంపుగట్టు సమీపంలో కృష్ణసముద్రం వెళ్లే కాల్వ పనులను పరిశీలించి, కాల్వకు అడ్డంగా ఉన్న మట్టిని తొలగించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కానాయపల్లి సర్పంచ్ రావుల రాజేశ్వరమ్మ కలెక్టర్‌ను కలిసి ఏడేళ్లుగా పునరావాస పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని వివరించారు. పునరావాసానికి కేటాయించిన భూమి సమీపంలో ఉన్న 58 ఎకరాలను కూడా తమకు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా కృష్ణ సముద్రం సాగునీరు వదలడం ద్వారా రాజపేట గ్రామపరిధిలోని 263 ఎకరాలు ముంపునకు గురవుతుందని నిర్వాసితుల సొసైటీ చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. రాజపేటలో ముంపుబాధితులకు పరిహారం నేటికీ అందలేదని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
వీపనగండ్ల: భీమా కాల్వల నిర్మాణ పనుల్లో భాగంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట రోడ్డుబ్రిడ్జి, అండర్‌గ్రౌండ్ కెనాల్ చేపట్టేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని తూంకుంట గ్రామ సమీపంలోని శిథిలమైన భీమా కాల్వలతో పాటు కోతకు గురైన బీటీరోడ్డును పరిశీలించారు. శిథిలమైన కాల్వల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టడంతో పాటు అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భీమా కాల్వ నీటితో తూంకుంట గ్రామ చౌడమ్మ చెరువును నింపేందుకు డిస్ట్రిబ్యూటర్‌ను ఏర్పాటుచేయాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.