నేవీ యార్డ్ కాల్పుల ఘటనలో ఎన్నారై మృతి | Indian-American among those killed in US Navy Yard shooting | Sakshi
Sakshi News home page

నేవీ యార్డ్ కాల్పుల ఘటనలో ఎన్నారై మృతి

Sep 17 2013 10:18 AM | Updated on Sep 1 2017 10:48 PM

నేవీ యార్డ్ కాల్పుల ఘటనలో ఎన్నారై మృతి

నేవీ యార్డ్ కాల్పుల ఘటనలో ఎన్నారై మృతి

వాషింగ్టన్లోని నేవీ యార్డ్లో దుండగులు నిన్న జరిపిన కాల్పుల ఘటనలో మరణించిన వారిలో ఎన్నారై కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేవీ యార్డ్లో దుండగులు నిన్న జరిపిన కాల్పుల ఘటనలో మరణించిన వారిలో ఓ భారతీయ అమెరికన్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతుడు ఎన్నారై విష్ణు పండిట్ (61)గా గుర్తించినట్లు తెలిపారు. కాగా ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 13కు చేరుకుందని చెప్పారు. అయితే మృతుల్లో 12 మంది కాంట్రాక్టర్లే అని భావిస్తున్నామన్నారు. మరణించిన వారిలో ఏడుగురి మృతదేహలను గుర్తించినట్లు తెలిపారు. వారి వివరాలను సోమవారం ఇక్కడ విడుదల చేశారు.

 


అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు చేరువలోనే సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఆ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయాలపాలయ్యారు. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి దండగులపై కాల్పులు జరిపారు. దాంతో ఓ దుండగుడు మరణించగా, మరో ఇద్దరు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేసినట్లు వాషింగ్టన్ పోలీసు ఉన్నతాధికారు చెప్పారు. అయితే  నేవీ యార్డ్ కాల్పుల ఘటనను ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఖండించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement