జాతీయ రహదారిపై ఆక్రమణల తొలగింపు | illegal constructions collapse at national highway in nellore district | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ఆక్రమణల తొలగింపు

Apr 12 2016 1:40 PM | Updated on Sep 3 2017 9:47 PM

నెల్లూరు జిల్లా తడ ఐదవ నంబర్ జాతీయ రహదారిపై ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు.

తడ: నెల్లూరు జిల్లా తడ ఐదవ నంబర్ జాతీయ రహదారిపై ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో స్థానిక వ్యాపారులు ఆందోళనకు దిగారు. తడ మండలం బీవీ పాలెం చెక్‌పోస్ట్ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా అక్రమంగా సుమారు 100 వరకు షాపులు వెలిశాయి. దీంతో రహదారి మార్గం కొంత కుచించుకుపోయింది. జాతీయ రహదారుల, ప్రాధికార సంస్థ ఫిర్యాదు మేరకు రెవెన్యూ , పోలీసు అధికారులు మంగళవారం రంగంలోకి దిగారు. షాపులు తీసివేయాలని అధికారులు ముందు నుంచే చెబుతున్నా స్థానికులు వినకపోయే సరికి చివరికి తొలగింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement