'వాళ్లు ఒక్కసారి తిడితే...నేను రెండుసార్లు తిడతా' | If TRS scold cm kiran kumar reddy once, i will scold them twice: MLA Jagga Reddy | Sakshi
Sakshi News home page

'వాళ్లు ఒక్కసారి తిడితే...నేను రెండుసార్లు తిడతా'

Sep 19 2013 1:34 PM | Updated on Sep 1 2017 10:51 PM

'వాళ్లు ఒక్కసారి తిడితే...నేను రెండుసార్లు తిడతా'

'వాళ్లు ఒక్కసారి తిడితే...నేను రెండుసార్లు తిడతా'

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే  తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటంతో టీఆర్ఎస్ నేతలకు పనిలేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్రావు, కేటీఆర్లు మతి భ్రమించి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని ఒక్కసారి తిడితే ....తాను రెండుసార్లు వారిని తిట్టాల్సి వస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాలను చేపట్టి... సీమాంధ్రలో కూడా పర్యటిస్తారని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నందున వెనక్కి తగ్గటం సాధ్యం కాదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement