లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా? | if Necessary acquire one lakh acres for capital, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా?

Sep 27 2014 3:28 PM | Updated on Aug 18 2018 5:48 PM

విజయవాడలో రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్ : విజయవాడలో రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా అని ఆంధ్రప్రదేశ్  పీసీసీ  అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లో ప్రభుత్వ సంస్థలు వందల ఎకరాల్లోనే ఉన్నాయని, విజయవాడ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు వెల్లడించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు.

వ్యవసాయ భూములను ఇతరత్రా అవసరాలకు సేకరించరాదనే ఏకాభిప్రాయం ఉందని రఘువీరా అన్నారు.రహస్య అజెండాతోనే ప్రభుత్వ పెద్దల లక్ష ఎకరాలు సేకరించాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా సహకరించిన వారికి లబ్ధి చేకూరాలనేదే ప్రభుత్వ అసలు అజెండా అని రఘువీరా విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement