తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఒకటో వార్డు కౌన్సిలర్ జానీ స్పష్టం చేశారు.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఒకటో వార్డు కౌన్సిలర్ జానీ స్పష్టం చేశారు. శుక్రవారం సాక్షి మీడియాతో జానీ ఫోన్లో మాట్లాడారు. తాను అనారోగ్యంగా ఉన్నానని... అందువల్లే వైద్య చికిత్స కోసం జమ్మలమడుగు వదిలి వెళ్లానని తెలిపారు. తనను కిడ్నాప్ చేశారంటూ వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెట్టడం తీవ్ర వేదనకు గురి చేసిందని జానీ వెల్లడించారు.
జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో తనను ఇంత వరకు ఏ అధికారి సంప్రదించలేదన్నారు. అధికారులు తనను సంప్రదించి ఉంటే కిడ్నాప్ జరగలేదని సదరు అధికారులకు వెల్లడించేవాడినని చెప్పారు. తన కుటుంబ సభ్యులను సంప్రదించిన కనీసం తాను కిడ్నాప్ కాలేదని చెప్పేవారని జానీ వివరించారు. అయితే తాను ప్రస్తుతం ఎక్కడ ఉన్నది చెప్పేందుకు జానీ నిరాకరించారు.