కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను హత్యచేశాడు.
కడప: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను హత్యచేశాడు. ఈ సంఘటన కడప జిల్లాలోని తాలుక పోలీసుస్టేషన్ పరిధిలోని తారక రామనగర్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మహబూబ్‌జాన్(32)కు మల్లికార్జున్‌తో గతంలో ప్రేమ వివాహం అయింది.
ఈ మద్య తరచూ వారిద్దరి మద్య గొడవలు జరుగుతుండటంతో మల్లికార్జున్ ఆదివారం మధ్యాహ్నం భార్య మహబూబ్‌జాన్‌ను హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించి మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు.