
కారెక్కిన సత్యవతి
టీడీపీకి చెందిన డోర్నకల్ ఎమ్మె ల్యే సత్యవతి రాథోడ్ ముందుగా ప్రకటించినట్లుగానే సైకిల్ ది గి కారెక్కారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో...
- కేసీఆర్ సమక్షంలో ‘గులాబీ’ తీర్థం
- వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచే పోటీ
- ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత
వరంగల్, న్యూస్‌లైన్ : టీడీపీకి చెందిన డోర్నకల్ ఎమ్మె ల్యే సత్యవతి రాథోడ్ ముందుగా ప్రకటించినట్లుగానే సైకిల్ ది గి కారెక్కారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో సోమవా రం ఆ పార్టీలో చేరారు. సత్యవతి రాథోడ్‌కు కేసీఆర్ సాధార స్వాగతం పలికి.. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి ఆమె తిరిగి పోటీచేస్తారని ప్రకటించారు.
అంతేకాకుండా... టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇంతకాలం పనిచేస్తున్న కిషన్‌నాయక్ స్థానం లో ఆమెను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేం దుకు గులా బీ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
కొద్ది రోజులుగా జిల్లాలోని టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ నేతలు గాలం వేస్తున్నారనే ప్రచారం సాగు తూ వచ్చిం ది. ఈ క్రమంలోనే గిరిజన సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ శనివారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చలు జరిపారు. అనంతరం ఆదివా రం నియోజకవర్గం లోని ముఖ్యకార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చంద్రబాబు వ్యవహరిం చిన తీరు కు నిరసనగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటిం చిన విష యం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆమె కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంది. కాగా, సత్యవతి చేరిక తో జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బలం నాలుగు కు చేరిం ది. హైదరాబాద్‌లో ఆమె వెంట టీఆర్‌ఎస్ నేతలు బోయినపల్లి, కడి యం శ్రీహరి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రాజయ్యయాదవ్ ఉన్నారు.