హోంమంత్రి కాన్వాయ్‌లో అపశృతి | Home convoy apasrti | Sakshi
Sakshi News home page

హోంమంత్రి కాన్వాయ్‌లో అపశృతి

Oct 26 2014 4:04 AM | Updated on Sep 2 2017 3:22 PM

హోంమంత్రి కాన్వాయ్‌లో అపశృతి

హోంమంత్రి కాన్వాయ్‌లో అపశృతి

మైదుకూరు టౌన్: మైదుకూరు నియోజవర్గంలోని జాండ్లవరం గ్రామంలో ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌తో

మైదుకూరు  టౌన్:
 మైదుకూరు నియోజవర్గంలోని జాండ్లవరం గ్రామంలో ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకం ప్రారంభోత్సవ  కార్యక్రమానికి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌తో వెళుతుండగా అపశృతి చోటు చేసుకుంది. మైదుకూరు-జాండ్లవరం మార్గమధ్యంలోని పుల్లయ్యస్వామి సత్రం సమీపంలో మైదుకూరు యూత్ బలిజ సంఘం నాయకుడు ఏపీ రవీంద్ర వెళుతున్న స్కార్పియో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ సంఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ నాగసుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. మహేష్, కిట్టు అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. దస్తగిరి, చంద్ర, గోవిందు, హరి, సాయిలకు స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ నరసింహారెడ్డి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం డ్రైవర్ నాగసుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement