కాంగ్రెస్ ఎంపీలుగా ఎందుకున్నామా అని బాధపడుతున్నాం? | High Command cheating, says Ongole MP Magunta sreenivasulu reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎంపీలుగా ఎందుకున్నామా అని బాధపడుతున్నాం?

Oct 8 2013 1:05 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ ఎంపీలుగా ఎందుకున్నామా అని బాధపడుతున్నాం? - Sakshi

కాంగ్రెస్ ఎంపీలుగా ఎందుకున్నామా అని బాధపడుతున్నాం?

కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు.

ఒంగోలు : కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అనుసరించిన విధానం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఎందుకు ఉన్నామా అని....ఇప్పుడు బాధపడుతున్నామన్నారు.  తెలంగాణపై కేబినెట్ నోట్ రహస్యంగా ఉంచి టేబుల్ అజెండాగా తీసుకు రావటం అధిష్టానం దుర్మర్గమైన చర్య అని మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యానించారు.

మరోవైపు సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుల్లో ఇద్దరు హాజరు కాగా, మరో ఇద్దరు గైర్హాజరు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement