బాధితులను ఆదుకోండి
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదం సంఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ....
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
హైదరాబాద్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదం సంఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


