గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ | heavy cowd in yadagiri gutta | Sakshi
Sakshi News home page

గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

Sep 16 2013 4:01 AM | Updated on Nov 6 2018 5:47 PM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సెలవుదినం కావడం, అందులోనూ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ పెరిగింది.


 యాదగిరికొండ, న్యూస్‌లైన్
 యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సెలవుదినం కావడం, అందులోనూ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని   భక్తుల రద్దీ పెరిగింది. ధర్మదర్శనం, టికెట్టు దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ పరిసరాలు, సంగీత భవనం, గర్భాలయంలో భక్తులు కిక్కిరిసి పోయారు. స్వామి వారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారిని సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు అధిక సంఖ్యలో ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement