ఫైనాన్స్ వ్యాపారి హరినాథ్ హత్యకేసులో నిందితులు వెంకటేశ్వరరావు, నాగరాజులను కొయ్యలగూడెం పోలీసులు సోమవారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు.
జంగారెడ్డిగూడెం : ఫైనాన్స్ వ్యాపారి హరినాథ్ హత్యకేసులో నిందితులు వెంకటేశ్వరరావు, నాగరాజులను కొయ్యలగూడెం పోలీసులు సోమవారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.9.70 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే వెంకటేశ్వరరావు .... వ్యాపారి హరినాథ్ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. హత్య కేసు నుంచి తప్పించుకోవటం కోసమే నిందితులు కిడ్నాప్ డ్రామా ఆడారని పోలీసులు వెల్లడించారు.