తుపాన్ బాధితులను ఆదుకుంటాం: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

తుపాన్ బాధితులను ఆదుకుంటాం: చంద్రబాబు

Published Mon, Oct 20 2014 6:43 PM

తుపాన్ బాధితులను ఆదుకుంటాం: చంద్రబాబు - Sakshi

హైదరాబాద్: హుదూద్ తుపాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  తుపాన్ తీవ్రత, నష్టం ఎక్కువగా ఉందని అన్నారు. తుపాన్ వల్ల వాటిల్లిన నష్టాల వివరాలను వెల్లడించారు.

బుధవారం నాటికి నిత్యావసర సరుకులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. తుపాన్ బాధితులను ఆదుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రాంతాలను దత్తతకు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖను డైనమిక్ సిటీగా తీర్చుదిద్దుతామని తెలిపారు. రైతుల రుణమాఫీ త్వరలో అమలయ్యేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement