సర్పంచ్‌లకు చెక్‌పవర్.. ఉత్తర్వులు జారీ | Government restore check power to Sarpanches | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు చెక్‌పవర్.. ఉత్తర్వులు జారీ

Oct 31 2013 5:37 AM | Updated on Sep 2 2017 12:10 AM

సర్పంచ్‌ల సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతల ఆందోళన నేపథ్యంలో, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌ల సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతల ఆందోళన నేపథ్యంలో, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెక్‌పై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్  కలసి సంతకం చేయడం సర్పంచ్‌లకే అవమానవుంటూ పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో గతంలోని జారుుంట్ చెక్‌పవర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి ఉత్తర్వులిచ్చారు.
 
 అయితే పంచాయతీల్లో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆంక్షలు విధించారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి చెల్లింపులకూ వీల్లేదని, ప్రతి చెల్లింపునూ రిజిష్టర్‌లో, క్యాష్‌బుక్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనువుతులు లేని పనులు చేపట్టరాదని, నగదు రూపంలో చెల్లింపు కుదరదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రొక్యూర్‌మెంట్ విధానానికి అనుగుణంగా కొనుగోళ్లు ఉండాలన్నారు. చెక్‌బుక్‌లు, రిజిష్టర్లు ఇళ్లలో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీ వసూలు చేసే డబ్బును ముందుగా ట్రెజరీలో జమ చేయాల్సిందేనన్నారు. నిధుల వ్యయానికి గ్రామ కార్యదర్శి కూడా బాధ్యత వహించాలని, వ్యయానికి సంబంధించి మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని,  ఏమాత్రం నిర్లక్ష్యంఉన్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
 సర్పంచ్‌ల సంఘం హర్షం: పంచాయతీల నిధుల వ్యయంలో జారుుంట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి సర్పంచ్‌లకు పూర్తిస్తాయి చెక్‌పవర్ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపట్ల రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి, గౌరవ సలహాదారు పిల్లి సత్తిరాజు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడాన్ని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య  స్వాగతించారు. సర్పంచ్‌కు గౌరవవేతనాన్ని ఆరువందల రూపాయలను 20 వేల రూపాయలకు పెంచాలని ఆయున డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement