వడదెబ్బతో బస్సులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి | government employee dies in bus after heat-stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో బస్సులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి

May 12 2019 1:51 PM | Updated on May 12 2019 2:23 PM

government employee dies in bus after heat-stroke  - Sakshi

వడదెబ్బతో ఓ ప్రభుత్వ ఉద్యోగి బస్సులోనే మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోకు ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది

సాక్షి, గోకవరం : వడదెబ్బతో ఓ ప్రభుత్వ ఉద్యోగి బస్సులోనే మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ అటవీశాఖలో పని చేస్తున్న మడి గంగరాజు ఇవాళ ఉదయం భార్యతో కలిసి కుమారుడి దగ్గరకు బయల్దేరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గంగరాజు మధ్యలోనే అస్వస్థతకు గురై... బస్సులోనే మృతి చెందారు. అప్పటివరకూ తనతో మాట్లాడిన భర్త విగతజీవిగా మారడంతో భార్య భోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Advertisement
 
Advertisement
Advertisement