శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రూ. 7 లక్షల బంగారం పట్టివేత | Gold worth over Rs. 7 lakhs recovered from air passenger at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రూ. 7 లక్షల బంగారం పట్టివేత

Feb 16 2014 8:10 AM | Updated on Sep 2 2017 3:46 AM

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు.

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతరం అతడిని సోదా చేశారు. ఆ క్రమంలో అతడి బట్టలలో రూ. 7 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement