'గెయిల్' హామీని నిలబెట్టుకోవాలి | ' Gail ' pledges must be implemented in nagaram incident | Sakshi
Sakshi News home page

'గెయిల్' హామీని నిలబెట్టుకోవాలి

Jan 26 2015 3:40 PM | Updated on Sep 2 2017 8:18 PM

తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీని గెయిల్ యాజమాన్యం నిలబెట్టుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది.

మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీని గెయిల్ యాజమాన్యం నిలబెట్టుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. గత ఏడాది జిల్లాలోని నగరం గ్రామంలో గత ఏడాది గ్యాస్ పైప్‌లైన్ లీకై అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఆ సందర్భంగా నగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని గెయిల్ యాజమాన్యం వాగ్దానం చేసింది. కానీ హామీని అమలు చేయకపోవడంతో గ్రామస్తులు గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement