సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్ | G. Vivek don't want to become telangana Chief Minister | Sakshi
Sakshi News home page

సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్

Jan 17 2014 11:43 PM | Updated on Sep 2 2017 2:43 AM

సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్

సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాను ముఖ్యమంత్రి రేసులో ఉంటాననే ప్రచారం అవాస్తవమని ఎంపీ జి.వివేక్ తెలిపారు.

మంథని: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాను ముఖ్యమంత్రి రేసులో ఉంటాననే ప్రచారం అవాస్తవమని ఎంపీ జి.వివేక్ తెలిపారు. సీఎం పదవి కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రచారం చేస్తున్నారని, పదవుల కోసం ఏనాడూ ఆరాటపడ లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసిన వారిని తెలంగాణ ఫ్రీడం ఫైటర్స్‌గా గుర్తించాలని అన్నారు.

ఈ విషయమై రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొలువుదీరే ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ ఎన్నోసార్లు పదవీ త్యాగం చేసిన కేసీఆర్ లాంటి వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యమంలో సరైన సమయంలో త్యాగం చేస్తేనే ఫలితం లభిస్తుంది కానీ.. స్వప్రయోజనాల కోసం చేస్తే త్యాగాలు చేస్తే లాభం ఉండదని మంత్రి శ్రీధర్‌బాబు నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement