స్టెప్పులు కుదిరే.. హాస్యం అదిరే! | freshers day celebrations in kg reddy college | Sakshi
Sakshi News home page

స్టెప్పులు కుదిరే.. హాస్యం అదిరే!

Dec 25 2013 2:47 AM | Updated on Mar 28 2018 10:59 AM

స్టెప్పులు కుదిరే.. హాస్యం అదిరే! - Sakshi

స్టెప్పులు కుదిరే.. హాస్యం అదిరే!

‘లౌలి’ సినిమా హీరో ఆది, హీరోయిన్ శాన్వి మంగళవారం కేజీ రెడ్డి కళాశాలలో సందడి చేశారు. సినిమా పాటలకు స్టెప్పులేసి విద్యార్థులను ఉర్రూతలూగించారు. హాస్యనటులు మోహన్, పృథ్వీ విద్యార్థులను కడుపుబ్బా నవ్వించారు.


 కేజీ రెడ్డి కళాశాలలో ఉత్సాహంగాఫ్రెషర్స్ డే
 హాజరైన సినీనటులు ఆది, శాన్వి, మోహన్, పృథ్వీ
 మొయినాబాద్, న్యూస్‌లైన్: ‘లౌలి’ సినిమా హీరో ఆది, హీరోయిన్ శాన్వి మంగళవారం కేజీ రెడ్డి కళాశాలలో సందడి చేశారు. సినిమా పాటలకు స్టెప్పులేసి విద్యార్థులను ఉర్రూతలూగించారు. హాస్యనటులు మోహన్, పృథ్వీ విద్యార్థులను కడుపుబ్బా నవ్వించారు.

 

మండలంలోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ‘ఫెషర్స్ డే 2కే13’ కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నిం పారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఎంజాయ్‌మెంట్ సైతం ఉండాలన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్ సీఐ రవిచంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ నాయర్, ఏఓ రవికిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement