తొలి రోజు ఉచిత రేషన్‌  21.55 లక్షల కుటుంబాలకు.. | Free Ration Distribution to above 21 lakh people in AP on day one | Sakshi
Sakshi News home page

తొలి రోజు ఉచిత రేషన్‌  21.55 లక్షల కుటుంబాలకు..

Apr 30 2020 3:44 AM | Updated on Apr 30 2020 3:44 AM

Free Ration Distribution to above 21 lakh people in AP on day one - Sakshi

శ్రీకాకుళంలోని గుడి వీధిలో ఇంటి వద్దే రేషన్‌ ఇస్తున్న వలంటీర్‌

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న మూడో విడత ఉచిత సరుకుల పంపిణీ  ప్రారంభమైన బుధవారం తొలిరోజు 21.55 లక్షల కుటుంబాలకు అందించినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. 
► రేషన్‌ దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈసారి కూడా లబ్ధి్దదారులకు టైంస్లాట్‌తో కూడిన కూపన్లు పంపిణీ చేశారు.
► ప్రభుత్వ సూచనల మేరకు రేషన్‌ షాపుల వద్ద శానిటైజర్లను డీలర్లు అందుబాటులో ఉంచారు. సరుకుల కోసం వచ్చిన వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే రేషన్‌ డీలర్లు బయోమెట్రిక్‌ తీసుకున్నారు. బియ్యంతో పాటు కందిపప్పు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 
► రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 4,73,537 కుటుంబాలకు  పోర్టబులిటీ ద్వారా సరుకులు అందించారు. 
► వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్‌ స్తంభాలు కూలడంతో కొన్ని చోట్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ–పాస్‌ మిషన్లు పని చేయకపోవడంతో ఆ రెండు జిల్లాల్లో పంపిణీ ఆలస్యమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement