మనకో నాలుగు కొత్త రైళ్లు | Sakshi
Sakshi News home page

మనకో నాలుగు కొత్త రైళ్లు

Published Tue, Jul 8 2014 1:14 PM

four new trains announced for telugu states

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్లు, వినతుల మేరకు జనసాధారణ్, ప్రీమియం రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు.  5 జనసాధారణ, 5 ప్రీమియం, 6 ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లు, 20 ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇంకా మెము, డెము రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.

ఈ రైళ్ల వివరాలను ఆయన చదువుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు విపరీతంగా నినాదాలు చేస్తుండటంతో బీజేపీ సభ్యులు కూడా వారికి పోటీగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ వివాదం నడుమే సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఆ వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. సదానంద గౌడ ప్రకటించినవాటిలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

సికింద్రాబాద్-నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్ప్రెస్
విజయవాడ- న్యూఢిల్లీ ఏసీ ఎక్స్ప్రెస్
పారాదీప్- విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్
విశాఖ -చెన్నై వీక్లీ ఎక్స్ప్రెస్

Advertisement
Advertisement