అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్పల మండలం పప్పూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొన్నాయి.
ఈ సంఘటనలో నలుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.