జిల్లాలో ఫిషింగ్ హర్బర్లో బుధవారం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విశాఖ పోర్టులో చిరు దుకాణాలను తొలగించేందుకు
విశాఖ: జిల్లాలో ఫిషింగ్ హర్బర్లో బుధవారం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విశాఖ పోర్టులో చిరు దుకాణాలను తొలగించేందుకు అక్కడి యాజమాన్యం ప్రయత్నించడంతో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు పెద్దఎత్తునా ఆందోళన చేపట్టారు.
చిరు దుకాణాలను అడ్డుకునేందుకు యత్నించిన యజమాన్యాన్ని అడ్డుకున్నారు. పోర్టు ఛైర్మన్కు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని శాంతపరచి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.