నేటి నుంచి హోదా పోరు | Fighting status from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హోదా పోరు

Oct 17 2015 2:04 AM | Updated on May 25 2018 9:20 PM

నేటి నుంచి హోదా పోరు - Sakshi

నేటి నుంచి హోదా పోరు

అక్టోబరు 17 నుంచి 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు

21 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో     రిలేనిరాహార దీక్షలు
18న అన్ని చోట్లా ర్యాలీలు, సమావేశాలు
ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆగదు ఈ పోరాటం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 
ఆనందపేట (గుంటూరు): అక్టోబరు 17 నుంచి 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 17న రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయన్నారు.

18వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, అనంతరం సమావేశాలు నిర్వహించనున్నామన్నారు. 19న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా,20న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించున్నామన్నారు. 21వ తేదీన జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేయాలని పార్టీ ఈ కార్యక్రమాలను చేపట్టనుందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు  ప్రతి ఒక్క ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement