అంగన్‌వాడీ’ పోరు ఉధృతం | Fighting escalates anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ’ పోరు ఉధృతం

Mar 1 2014 2:58 AM | Updated on Jun 2 2018 8:29 PM

అంగన్ ‘వేడి’ పెరిగింది. ప్రభుత్వం రెండు సార్లు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు.

ఇందూరు, న్యూస్‌లైన్: అంగన్ ‘వేడి’ పెరిగింది.  ప్రభుత్వం రెండు సార్లు చర్చలు జరిపి సమస్యల పరి ష్కారానికి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. శుక్రవారం  సుభాష్ నగర్‌లో గల ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) కార్యాలయానికి తాళం వేసి నిరస న తెలిపారు.  పని చేస్తున్న ఉద్యోగులను బయటకు రప్పించి ప్రభుత్వ కార్యకలాపాల ను అడ్డుకున్నారు.  రెండు గంటల పాటు ఆం దోళన చేశారు. దీంతో పోలీసు రంగ ప్రవేశం చేసినప్పటికీ అంగన్‌వాడీలు ప్రతిఘటించా రు.

 దీంతో పోలీసులు ధర్నాను చూస్తు ఉండిపోయారు.  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాములు మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగి వచ్చే వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా లు పోరాటాన్ని ఆపవద్దన్నారు. పగలనక,రాత్రనక సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తుంటే  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిభా రం పెంచుతూ, చట్టాలను కాలరాస్తూ,కనీస వేతనాలు పెంచకుండా వారి పొట్టగొడుతోం దన్నారు.  హైదరాబాద్‌లోధర్నాకు జిల్లా నుం చి తరలుతున్న అంగన్‌వాడీలను అక్రమంగా పోలీసులచే అరెస్టులు చేయించి, అర్ధరాత్రి మహిళలను పోలీసు స్టేషన్‌లో, కల్యాణ మండపంలో ఉంచడం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. సమస్యలను పరి ష్కరించాల్సిన ప్రభుత్వం రెచ్చగొట్టే  విధంగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వ మే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యమం మరింత ఉధృతం కాక ముందే అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వక హామీనివ్వాలని డిమాండ్ చేశారు.

 మీ సమస్యలు చర్చకు వచ్చాయి..
 ఇంతలో ఐసీడీఎస్ పీడీ రాములు కార్యాలయానికి చేరుకుని, తాళాలు తెరవాలని కోరారు. ఇప్పుడే ఐసీడీఎస్ కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మీ సమస్య లు చర్చకు వచ్చాయని తెలిపారు. జిల్లాలో అంగన్‌వాడీలు మూత పడ్డాయని కూడా తెలియజేసినట్లు చెప్పా రు. వెంటనే అంగన్‌వాడీ, సీఐటీయూ నాయకులు తా ళాలు తెరిచి ఆందోళనను విరమిం చారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రోజుకో రీతిలో ఆం దోళనను చేపడతామని వారు స్పష్టం చేశారు. సీఐటీయూ, సీపీఎం నాయకులు గోవర్థన్, నూర్జహన్, మధు, దం డి వెంకట్, లత, అంగన్‌వాడీ ఉద్యోగ సంఘ నాయకు లు సూర్యకళ, అంగన్‌వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement