రావెల, గల్లా జయదేవ్ను అడ్డుకున్న రైతులు | farmers protest before Ravela kishore, Galla Jayadev | Sakshi
Sakshi News home page

రావెల, గల్లా జయదేవ్ను అడ్డుకున్న రైతులు

Nov 1 2014 4:38 PM | Updated on Oct 1 2018 2:03 PM

రావెల, గల్లా జయదేవ్ను అడ్డుకున్న రైతులు - Sakshi

రావెల, గల్లా జయదేవ్ను అడ్డుకున్న రైతులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్లకు చేదు అనుభవం ఎదురైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్లకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం గుంటూరు జిల్లా కాకుమానులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రావెల, జయదేవ్లను రైతులు అడ్డుకున్నారు. రైతుల రుణమాఫీని ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ రైతులు వారిని నిలదీశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement