అప్రకటిత విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆదివారం పోచంపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అప్రకటిత విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆదివారం పోచంపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రేవనపల్లి ఫీడర్ నుంచి గ్రామానికి కరెంట్ సరఫరా అవుతుందని తెలిపారు. మూడు రోజులుగా కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా అవుతుందని, దీంతో వరినాట్లు ఎండిపోతున్నాయని ఆరోపిం చారు.
లో ఓల్టేజీ సమస్య కూడా ఉందని అన్నారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ట్రాన్స్‌కో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్‌ను సమస్యను పరిష్కరించకపోతే బిల్లుల చెల్లింపు నిలిపివేస్తామని హెచ్చరించారు. తెగిపోతున్న కరెంట్ తీగలను కూడా మార్చాలని కోరారు. కార్యక్రమంలో మేక ల నర్సిరెడ్డి, వారాల నర్సిరెడ్డి, జంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మల్లారెడ్డి, భగవంతరెడ్డి, బస్వారెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.