పొదలకూరులో రైతుల ఆందోళన | farmers dharna at lemon market | Sakshi
Sakshi News home page

పొదలకూరులో రైతుల ఆందోళన

Feb 19 2016 2:19 PM | Updated on Jun 4 2019 5:16 PM

నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వద్ద రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వద్ద రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల తర్వాత కాయలతో మార్కెట్‌కు వస్తేనే కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చేసి గేట్లను మూసివేయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడున్న రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారుల ధోరణిపై మండిపడ్డారు. ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి రంగలోకి దిగి సర్దుబాటు చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement