అప్పుల బాధతో గుండెపోటు.. రైతు మృతి | farmer died with worrying of crop lose and heartattack | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో గుండెపోటు.. రైతు మృతి

Oct 1 2015 4:23 PM | Updated on Apr 6 2019 8:52 PM

అప్పుల బాధతో మానసిక వేదనకు గురవుతున్న ఓ రైతు గుండెపోటుతో తన పొలంలోనే మృతి చెందాడు.

కోస్గి(కర్నూల్) : అప్పుల బాధతో మానసిక వేదనకు గురవుతున్న ఓ రైతు గుండెపోటుతో తన పొలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూల్‌ జిల్లా కోస్గి మండలంలోని జలగల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జలగల గ్రామానికి చెందిన రొక్కప్పకు వరుసగా మూడేళ్లపాటు పంటలు సరిగా పండలేదు. దీంతో రెండు లక్షల రూపాయల అప్పులయ్యాయి.

దీనికి తోడు కొడుకు ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో తన పొలంలో ఉండగా రైతు రొక్కప్పకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement