ప్రయోగాత్మకంగా స్వర్ణ రథ పరిశీలన | Sakshi
Sakshi News home page

ప్రయోగాత్మకంగా స్వర్ణ రథ పరిశీలన

Published Tue, Sep 9 2014 2:21 AM

ప్రయోగాత్మకంగా స్వర్ణ రథ పరిశీలన

తిరుమల: తిరుమలలో సోమవారం శ్రీవారి స్వర్ణరథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించి పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ మండపం నుంచి  రథాన్ని  వెలుపలకు తీసారు. ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు లాగారు. ఎస్‌ఈ రమేష్‌రెడ్డి, ఈఈలు జీవీ కృష్ణారెడ్డి, నరసింహమూర్తి, ఏఈ దేవరాజులు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సీఎండీ ప్రసాదరావు, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు .. రథం పనితీరును పరిశీలించారు. రథచక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో చూశారు. మలుపుల వద్ద ఎంత దూరంలో ఉన్నప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకునే విషయంపై అధ్యయనం చేశారు.

శ్రీవారి చక్రస్నానం

తిరుమలలో సోమవారం శ్రీవారి చక్రస్నానం నిర్వహించారు.ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య చక్రస్నానం నిర్వహించారు.
 
 

Advertisement
Advertisement