సకాలంలో సేవలందించకపోతే జరిమానా! | ERC order ielectrical problems of penalties to be paid in right time | Sakshi
Sakshi News home page

సకాలంలో సేవలందించకపోతే జరిమానా!

Published Fri, Aug 9 2013 5:13 AM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM

కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రుసుములన్నీ చెల్లించి 30 రోజులు దాటినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోయినా, గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ పాడైందని ఫిర్యాదు చేసి 48 గంటలు దాటినప్పటికీ మార్చకపోయినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అధికారులు ఇకపై అధికంగా జరిమానాలు చెల్లించాల్సిందే.

విద్యుత్ సమస్యల పెనాల్టీలు పెంచుతూ ఈఆర్‌సీ ఆదేశాలు
 సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రుసుములన్నీ చెల్లించి 30 రోజులు దాటినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోయినా, గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ పాడైందని ఫిర్యాదు చేసి 48 గంటలు దాటినప్పటికీ మార్చకపోయినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అధికారులు ఇకపై అధికంగా జరిమానాలు చెల్లించాల్సిందే.
 
 ఈ మేరకు ఇప్పటికే ఉన్న పనితీరు ప్రమాణాల (స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్-ఎస్‌వోపీ) విధానంలో  మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గురువారం ఆదేశాలు జారీచేసింది. సకాలంలో సేవలు అందించకపోతే ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులకు తెలిపి నష్టపరిహారాన్ని పొందవచ్చునని ఈఆర్‌సీ పేర్కొంది. నష్టపరిహారం అందకపోతే వినియోగదారుల పరిష్కారాల ఫోరంను ఆశ్రయించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement