నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి | engineering admissions will be completed before month end | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి

Aug 6 2014 1:21 PM | Updated on Sep 2 2017 11:28 AM

నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి

నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి

ఆగస్టు నెలాఖరులోగా రెండు రాష్ట్రాల్లోను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

ఆగస్టు నెలాఖరులోగా రెండు రాష్ట్రాల్లోను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 23వ తేదీ వరకు చేస్తామని ఆయన అన్నారు. బుధవారం నాడు ఎంసెట్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మరోసారి ఎంసెట్ కమిటీ సమావేశం నిర్వహించి, పూర్తి విధివిధానాలు నిర్ణయిస్తామని అన్నారు. ఈ నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం పూర్తిచేసి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారమే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement