తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో సోమవారం ఉదయం జీసీఎస్లో ట్రాన్స్ఫార్మర్ పేలింది.
మలికిపురం : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో సోమవారం ఉదయం జీసీఎస్లో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. మంటలు చమురు ట్యాంకులకు వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నగరం ఘటన మరవక ముందే ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.