ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్‌ ప్రశంసలు

East Godavari Collector Facilitation Dharmadi Satyam Team - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్‌ 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు ఒడ్డుకు చేరుకుంది. బోటును ఒడ్డుకు చేర్చేందుకు నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్‌ వశిష్ట సక్సెస్‌’ అయింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మంగళవారం మధ్యాహ్నం బోటును ఒడ్డుకు తరలించింది. కాగా, ఎన్నో సవాళ్లతో కూడుకున్న బోటు ఆపరేషన్‌లో పాల్గొన్న ధర్మాడి సత్యం బృందం, స్కూబా డ్రైవర్ల బృందంపై జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సత్యంకు శాలువ కప్పి స్వీట్‌ తినిపించారు. దాంతో పాటు రూ.20 లక్షల చెక్కు అందజేశారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్‌ వాటర్‌ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్‌ డైవర్లు కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. గోదావరిలో రాయల్‌ వశిష్ట బోటు 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని సాంకేతిక పరిఙ్ఞానం ద్వారా తొలుత గుర్తించిన సంగతి తెలిసిందే.
(చదవండి : ఒడ్డుకు ‘వశిష్ట’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top