'ఇబ్బందులున్నా మిత్రధర్మం పాటించండి' | dont cross tdp, bjp alliance principles :sujana chowdary to tdp cadre | Sakshi
Sakshi News home page

'ఇబ్బందులున్నా మిత్రధర్మం పాటించండి'

Nov 7 2015 7:46 PM | Updated on Sep 2 2018 5:11 PM

క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నా మిత్ర ధర్మాన్ని పాటించాలని కేంద్ర మంత్రి సుజనాచౌదరి టీడీపీ శ్రేణులకు హితవు పలికారు.

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నా మిత్ర ధర్మాన్ని పాటించాలని కేంద్ర మంత్రి సుజనాచౌదరి టీడీపీ శ్రేణులకు హితవు పలికారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయాలని కోరారు. ఆయన శనివారం తాడేపల్లిగూడెం మాగంటి కల్యాణమండపంలో జరిగిన జిల్లా పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమస్యలు ఉంటే నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని అంతేకానీ.. మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు చేయవద్దని సూచించారు.

అంతకుముందు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు తిరుమల దర్శనం సిఫారసు లేఖలు కూడా పొందలేని దుస్థితిలో ఉన్నారన్నారు. చివరకు గ్యాస్ కనెక్షన్ల కేటాయింపులోనూ బీజేపీ నేతల హవాయే నడుస్తోందని చెప్పారు. ఇలాగైతే తిరుగుబాటు తప్పదని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, జడ్పీ చైర్మన్ బాలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement