కర్నూలు త్రీటౌన్ పోలీసులు నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో బెరైడ్డి రాజశేఖరరెడ్డి పిటిషన్
హైదరాబాద్: తనపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. గురువారమే పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సమయాభావం వల్ల విచారణకు రాలేదు. బెరైడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం మరోసారి న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు.