పోలీసుల త్యాగాలు మరువలేనివి | DGP Gautam Sawang With Media Over Journalist Attacks | Sakshi
Sakshi News home page

పోలీసుల త్యాగాలు మరువలేనివి

Oct 20 2019 4:29 AM | Updated on Oct 20 2019 8:43 AM

DGP Gautam Sawang With Media Over Journalist Attacks - Sakshi

సాక్షి, అమరావతి : పోలీసుల త్యాగాలు మరువలేనివని, పోలీసుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. సీఎం హామీ ఇచ్చి అమలుచేస్తున్న వీక్లీఆఫ్‌తో రాష్ట్రంలోని 62 వేల పోలీసు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయన్నారు.గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని అక్టోబర్‌ 21న వారం పాటు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. జర్నలిస్టులపై దాడులకు దిగితే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసుల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశం మనవైపు చూస్తోందని డీజీపీ సవాంగ్‌ వివరించారు. గడిచిన 13 వారాల్లో స్పందనలో వచ్చిన 98 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు వివరించారు.

నేనొక వినయపూర్వక ప్రభుత్వ అధికారిని మాత్రమే..
మాజీ సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా సవాంగ్‌ ఘాటుగానే బదులిచ్చారు. తనకు నటించడం చేతకాదని, డ్యూటీ చేయకుండా నాటకాలు ఆడనని, తనకు రాజకీయాలు తెలియవని,తానొక వినయపూర్వక (హంబుల్‌) ప్రభుత్వ అధికారిని మాత్రమేనని చెప్పారు.

ఒకసారి మాత్రమే ఉన్నతస్థాయి సమావేశానికి హాజరుకావడంవల్ల టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కలవలేకపోయానన్నారు.సమావేశంలో విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ కుమార్‌ విశ్వజిత్, హోంగారŠుడ్స ఏడీజీ హరీష్‌కుమార్‌గుప్త, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పీవీ సునీల్‌కుమార్‌లతోపాటు పలువురు ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement