డెంగీతో పన్నెండేళ్ల బాలిక మృతి | Dengue Fever kills 12 years old girl in ananthpur district | Sakshi
Sakshi News home page

డెంగీతో పన్నెండేళ్ల బాలిక మృతి

Sep 28 2015 7:33 AM | Updated on Jul 29 2019 5:43 PM

డెంగీ జ్వరంతో 12ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా తలుపుల మండలం తలుపుల రెడ్డివారి పాలెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

తలుపుల (అనంతపురం): డెంగీ జ్వరంతో 12ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా తలుపుల మండలం తలుపుల రెడ్డివారి పాలెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. తలుపుల రెడ్డివారి పల్లెకు చెందిన ఆశ ఆరో తరగతి చదువుకుంటోంది. మూడు రోజుల క్రితం డెంగీ జ్వరం రాగా బెంగుళూరులోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఉదయం ఆ బాలిక మృతి చెందింది. గత వారం రోజుల్లో ఈ గ్రామంలో ఇది రెండో డెంగీ మరణం. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement