పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు | daughter to marry, before the Rs. young man of 50 with a finger fraud | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

Oct 3 2013 4:35 AM | Updated on Aug 1 2018 2:29 PM

తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ముందుగా రూ. 50 వేలు తీసుకుని ఓ యువకుడు మోసం చేశాడంటూ మండలంలోని

 కొండాపురం, న్యూస్‌లైన్  : తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ముందుగా రూ. 50 వేలు తీసుకుని ఓ యువకుడు మోసం చేశాడంటూ మండలంలోని వెలిగండ్ల గ్రామానికి చెందిన మహిళ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు బుధవారం అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు... వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపాళేనికి చెందిన యువకుడితో వెలిగండ్ల యువత్జిట వివాహం చేసేందుకు గత జూలై 28వ తేదీన పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఆ మేరకు ఆగస్టు 18న నిశ్చితార్థం చేసుకునేందుకు నిర్ణయించారు. 
 
 ఇదే సమయంలో కట్నకానుకల కింద ఇచ్చే నగదులో రూ. 50 వేలు ముందుగా ఇవ్వాలని చెప్పి వారి నుంచి ఆ యువకుడు తీసుకున్నాడు. తర్వాత 18వ తేదీన నిశ్చితార్థం చేసుకునేందుకు కుదరడంలేదని, 25న ఏర్పాటు చేసుకుందామని చెప్పాడు. దానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. మధ్యలో 20వ తేదీన యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నేను పెళ్లి చేసుకోను’ అని చెప్పాడు. దీంతో వారు ఆ గ్రామ పెద్దలను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ యువకుడిని, వారి కుటుంబసభ్యులను విచారించగా పెళ్లికి నిరాకరించారు. దీంతో ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement