'ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం' | D Purandeswari pay tributes to NTR at NTR ghat | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం'

May 28 2015 9:23 AM | Updated on Sep 3 2017 2:50 AM

'ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం'

'ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం'

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్కి కుమార్తెగా పుట్టి... ఆయన 92వ జయంతి జరుపుకోవడం తన అదృష్టమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్కి కుమార్తెగా పుట్టి... ఆయన 92వ జయంతి జరుపుకోవడం తన అదృష్టమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మహానటుడికి పురంధేశ్వరి దంపతులు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ... పార్లమెంట్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అవకాశం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మహానటుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితేనే కేంద్రం ముందడుగు వేస్తుందని పురందేశ్వరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement