d.purandeswari
-
సీఎం బాగేల్ పై పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు
-
'ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌కి కుమార్తెగా పుట్టి... ఆయన 92వ జయంతి జరుపుకోవడం తన అదృష్టమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మహానటుడికి పురంధేశ్వరి దంపతులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ... పార్లమెంట్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అవకాశం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మహానటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితేనే కేంద్రం ముందడుగు వేస్తుందని పురందేశ్వరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
మరిదిగారిపై కోపం లేదు : పురందేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తనకు ఎటువంటి కోపం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి శనివారం విజయవాడలో తెలిపారు. తన మరిది చంద్రబాబు నాయుడిని తాను ఎప్పుడూ శత్రువుగా భావించలేదన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు లాభమేనని ఆమె అభిప్రాయపడ్డారు. పొత్తు పార్టీల మధ్య కానీ వ్యక్తుల మధ్య కాదని ఆమె గుర్తు చేశారు. తాను బీజేపీ ఆదేశాల మేరకే ముందుకెళ్తానని పురందేశ్వరి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని అంటూన్నారు... మీరు బీజేపీలో ఉన్నారు... మీకు చంద్రబాబు నాయడు అంటే కోపం కదా అని శనివారం విజయవాడ విచ్చేసిన పురందేశ్వరిని విలేకర్ల ప్రశ్నలు సంధించారు. దాంతో పురందేశ్వరి పై విధంగా స్పందించారు. -
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి : పురందేశ్వరి
రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైన ఉందని కేంద్ర మంత్రి డి.పురందేశ్వరి స్పష్టం చేశారు. అందుకోసం ఈ ప్రాంత ప్రజా ప్రనిధులంతా కేంద్రంతో పోరాడి ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. విశాఖ- జోధ్‌పూర్, విశాఖ-గాంధీగామ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను మంగళవారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆమె ప్రారంభించారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లులో రైల్వే జోన్‌పై కేంద్రం ఏటువంటి హామీ ఇవ్వలేదన్న సంగతిని ఈ సందర్బంగా పురందేశ్వరి గుర్తు చేశారు. భువనేశ్వర్‌లో ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం రైల్వే ఉద్యోగులు ఇటు స్థానికులు ఎన్నో ఉద్యమాలు, నిరసనలు చేశారు. అయిన ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరించింది. అయితే రాష్ట్ర విభజనపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అది విజయవాడ లేక విశాఖ అనేది మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. -
ఆస్తులు వెల్లడించని పల్లంరాజు, పురందేశ్వరి
న్యూఢిల్లీ: గడువు ముగిసి నెలరోజులు దాటిపోయినా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎం.ఎం.పల్లంరాజు, డి.పురందేశ్వరి తమ ఆస్తుల వివరాలను ప్రకటించలేదు. మంత్రులకు సంబంధించిన నియమావళి మేరకు కేంద్ర మంత్రులైతే ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రులైతే ముఖ్యమంత్రికి ఏటా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గడువు గత ఆగస్టు 31తో ముగిసిపోయింది. అయినా మంగళవారం వరకు మొత్తం 77 మంది కేంద్ర మంత్రుల్లో 35 మంది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వార్షిక వివరాలను ప్రధానికి అందజేయడంలో విఫలమయ్యారు. 32 మంది కేబినెట్ మంత్రుల్లో పల్లంరాజు సహా 18 మంది, 12 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రుల్లో ఏడుగురు, 33 మంది సహాయ మంత్రుల్లో పురందేశ్వరి సహా 17 మంది తమ ఆస్తుల వివరాలను దాఖలు చేయలేదు. కేబినెట్ మంత్రులు గులాం నబీ ఆజాద్, అజిత్ సింగ్, క పిల్ సిబల్, శ్రీప్రకాశ్ జైశ్వాల్, సహాయ మంత్రులు శశిథరూర్, ఆర్పీఎన్ సింగ్ తదితరులులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు. అయితే ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, శరద్‌పవార్, సుశీల్‌కుమార్ షిండే, వీరప్పమొయిలీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు ఆస్తులను వెల్లడించిన వారిలో ఉన్నారు.