27న రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష | CS Review on President's tour arrangements on 27th | Sakshi
Sakshi News home page

27న రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

Dec 21 2017 1:36 AM | Updated on Dec 21 2017 1:36 AM

CS Review on President's tour arrangements on 27th - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రాంనాధ్‌ కోవింద్‌ ఈ నెల 27న అమరావతి సచివాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీ వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ రాష్ట్రపతి పర్యటనపై బుధవారం డీజీపీ సాంబశివరావుతో సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను సక్రమంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. 27న కోవింద్‌ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో నాగార్జున వర్సిటీకి చేరుకుని అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement