అదనపు జలాలతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు నికర జలాల సాధనకోసం ఈ నెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: అదనపు జలాలతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు నికర జలాల సాధనకోసం ఈ నెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సమావేశం అనంతరం నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, రాష్ట్ర విభజన అంశం తేలిన తరువాతనే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశాన్ని ఖరారు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం అభిప్రాయపడింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.