కాంగ్రెస్ను వీడింది నాయకులే... కార్యకర్తలు కాదు | Congress party leaves only leaders not supporters, says Kanna Lakshminarayana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ను వీడింది నాయకులే... కార్యకర్తలు కాదు

Mar 11 2014 12:08 PM | Updated on Jul 29 2019 5:31 PM

కాంగ్రెస్ను వీడింది నాయకులే... కార్యకర్తలు కాదు - Sakshi

కాంగ్రెస్ను వీడింది నాయకులే... కార్యకర్తలు కాదు

కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అభివర్ణించారు.

కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అభివర్ణించారు. అలాంటి పార్టీలో చేరి కొమ్ములు వచ్చిన తర్వాత ఆ పార్టీని మోసం చేసి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు మాత్రమే వెళ్లిపోయారని కార్యకర్తలు కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో వ్యహరించింది.

 

అందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిరణ్ ముఖ్యమంత్రి పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, కొత్త పార్టీని స్థాపించనున్నారు.  అలాగే కేంద్ర మంత్రి పురందేశ్వరీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని విడుతున్న నేతలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు కన్నా పై విధంగా సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement