కాలేజ్ యాజమాన్యంపై కేసు నమోదు | collector respond to high fee in D.ed college | Sakshi
Sakshi News home page

కాలేజ్ యాజమాన్యంపై కేసు నమోదు

Nov 5 2015 12:49 PM | Updated on Sep 3 2017 12:04 PM

విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

పుత్తూరు: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కళాశాల యాజమాన్యంపై 420, 402 సెక్షన్‌ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుత్తూరులో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నిర్వహిస్తున్న శేషాచల డిఎడ్ కళాశాల యాజమన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు దండుకుంటోందని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement