కందుకూరి వీరేశలింగంకు సీఎం జగన్‌ నివాళి | CM YS Jagan Pays Tribute To Kandukuri Veeresalingam On His Birth Anniversary | Sakshi
Sakshi News home page

కందుకూరి వీరేశలింగంకు సీఎం జగన్‌ నివాళి

Apr 16 2020 10:34 AM | Updated on Apr 16 2020 10:39 AM

CM YS Jagan Pays Tribute To Kandukuri Veeresalingam On His Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం. సమాజంలోని అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకూ విద్యను అందించేందుకు పాటుపడ్డ గొప్ప సంఘసంస్కర్త ఆయన. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్బంగా ఘననివాళి’అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి:
బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం

Advertisement
 
Advertisement
Advertisement