
సాక్షి, అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమయింది. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామీణాభివృద్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారితో సీఎం జగన్ ప్రమాణం చేయించారు.