చిన్నశేషునిపై వేణుగోపాలుడు | Cinnasesuni venugopaludu | Sakshi
Sakshi News home page

చిన్నశేషునిపై వేణుగోపాలుడు

May 23 2014 3:13 AM | Updated on Sep 2 2017 7:42 AM

కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు.

కార్వేటినగరం, న్యూస్‌లైన్: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అర్చన, తోమాల, శుద్ధి, అభిషేకం, నిత్యకైంకర్య పూజలు చేశారు. 7.30 నుంచి 9 గంటల వరకు స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. గజ, వృషభాలు, చిన్నారుల చెక్కభజనలు, కోలాటం, భజన కీర్తనల నడుమ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది.
 
ఘనంగా స్నపన తిరుమంజనం
 
రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు గురువారం స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పసుపు, చందనం, పా లు, పెరుగు, నారికేళ జలాలు వంటి సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తుల ను అభిషేకించారు. వేద పండితులు సుందరవరదాచార్యులు, కిరణ్‌భట్టాచార్యులు, దీక్షితాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
 
రమణీయంగా ఊంజల్ సేవ
 
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఊంజల్ సేవను సాయంత్రం ఐదు గంటలకు రమణీయంగా నిర్వహించారు. సంకీర్తనాలాపన, వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 గంటలకు పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఉభయ దేవేరులతో వేణుగాన లోలుడు పురవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సిద్దారెడ్డి, జమేదార్ శివకృష్ణ, ఓఎస్‌డబ్ల్యూ శ్రీనివాసులు, పీఎన్.మూర్తి. ఆలయ సిబ్బంది, పెద్ద ఎత్తును భక్తులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement