25 లక్షల సీ-విటమిన్‌ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి | Sakshi
Sakshi News home page

25 లక్షల సీ-విటమిన్‌ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి

Published Mon, Apr 20 2020 11:27 AM

Chevireddy Bhaskar Reddy Distributed C Vitamin Tablets In Chandragiri - Sakshi

సాక్షి, తిరుపతి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు 25 లక్షల సీ–విటమిన్‌ టాబ్లెట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 15 చొప్పున వీటిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రూరల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్‌)

చంద్రగిరి నియోజకవర్గంలోసి విటమిన్స్ టాబ్లేడ్స్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

కార్డు లేని వారికీ ఉచిత రేషన్‌  
చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్‌కార్డులేని కుటుంబాలు 6 వేలు ఉన్నాయని, వాటికి ఉచితంగా రేషన్‌ అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తుమ్మలగుంటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. (చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి)

 

Advertisement
Advertisement